KRNL: ఆదోనిలో తాగునీటిపై ప్రజలు అపోహలు పెట్టుకోవద్దని మంగళవారం మున్సిపల్ కమిషనర్ నయీమ్ అహ్మద్ తెలిపారు. LLC కెనాల్ నుంచి కొత్తగా వచ్చే నీరు ఎర్రగా కనిపించడం సహజమని, భయపడాల్సిన అవసరం లేదన్నారు. క్లోరిన్ పరీక్షలు నిర్వహించి శుద్ధి చేసిన నీటినే సరఫరా చేస్తున్నామని వెల్లడించారు. కలుషిత నీరు వస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని ఆయన ప్రజలకు సూచించారు.