నేటి ఆధునిక కాలంలో చాలామంది కళ్ళద్దాలకు బదులుగా కాంటాక్ట్ లెన్సులను వాడుతున్నారు. వీటిని ఉపయోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. లెన్సులు పెట్టుకునే ముందు, తీసే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. వీటిని ధరించి నిద్రపోకూడదు. స్నానం చేయకూడదు. కంటికి గాలి తగిలేలా క్రమం తప్పకుండా విరామం ఇవ్వాలి. నాణ్యమైన సొల్యూషన్ వాడటం వల్ల కంటి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.