ప్రకాశం: ఒంగోలు సంఘమిత్ర ఆసుపత్రి సమీపంలో మద్యం మత్తులో లారీ డ్రైవర్ హల్ చల్ చేశాడు. బుధవారం రాత్రి లారీని రాష్ డ్రైవింగ్ చేస్తూ పట్టణంలోని వాహనదారులను భయభ్రాంతులకు గురి చేశాడు. కారుని ఢీకొట్టే ప్రయత్నం చేశాడు. అప్రమత్తమైన స్థానికులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారు.