వనపర్తి జిల్లా కేంద్రంలో ప్రయాణికుల రవాణా ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. నేడు జిల్లాలో ఆర్టీసీ అద్దె బస్సులు, ఔట్ సోర్సింగ్ సిబ్బందితో బస్సులు నడుపుతున్నామని తెలిపారు. ఈ సౌకర్యాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డీఎం దేవేందర్ గౌడ్ ఒక ప్రకటనలో కోరారు.