TG: ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం తగదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు విమర్శించారు. ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటామన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు ఎందుకు పట్టించుకోవడంలేదని మండిపడ్డారు.