KMR: బిక్కనూర్ మండలంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు, దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించాలని మండల కేంద్రానికి చెందిన రైతులు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని గురువారం కలిసి విన్నపించారు. దీంతో స్పందించిన ప్రభుత్వ సలహాదారు వర్షానికి నష్టపోయిన పంటలకు, నష్టపరిహారం అందే విధంగా కృషి చేస్తానని రైతులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.