NRPT: జూన్ 20న జరిగే లోక్ అదాలత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాసులు అన్నారు. నారాయణపేట జిల్లా కోర్టులో శనివారం ఎస్పీ, పోలీసు అధికారులు కోర్టు సిబ్బందితో కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు. లోక్ అదాలత్ పై ప్రజలకు అవగాహన కల్పించి పెద్ద సంఖ్యలో కేసులు రాజీ మార్గం ద్వారా పరిష్కారం అయ్యే విధంగా కృషి చేయాలని చెప్పారు.