SRHతో జరుగుతున్న మ్యాచ్‌లో RR భారీ స్కోరు దిశగా దూసుకుపోతోంది. కేవలం 11 ఓవర్లలోనే ఒక వికెట్ నష్టానికి 127 పరుగులు చేసింది. ఓపెనర్ జైస్వాల్ (10) తక్కువ పరుగులకే నిష్క్రమించినప్పటికీ, సూర్యవంశీ (77*), ధ్రువ్ జురెల్ (38*) కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. వీరిద్దరి బ్యాటింగ్ చూస్తుంటే రాజస్థాన్ 250 పరుగుల మార్క్‌ను కూడా సులభంగా అందుకునేలా కనిపిస్తోంది.