పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో బ్యాటర్లు పరుగుల వరద పారించారు. ఢిల్లీ 264 పరుగులు చేయగా, పంజాబ్ 265 పరుగులు చేసి విజయం సాధించింది. ఈ రెండు జట్లు కలిసి మొత్తం 529 పరుగులు నమోదు చేశాయి. దీంతో IPL చరిత్రలో అత్యధిక పరుగులు నమోదైన రెండో మ్యాచ్‌గా ఇది రికార్డు సృష్టించింది. మొదటి స్థానంలో 549 పరుగులతో SRH (287) Vs RCB (262) మ్యాచ్ ఉంది.