AP: కడప జిల్లా ఖాజీపేటలో బాలిక రామకీర్తనను గొంతుకోసి హత్య చేసిన నిందితుడు వెంకటేష్‌ను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. నిందితుడిని పట్టుకునే క్రమంలో పోలీసులపై దాడికి దిగడంతో జరిపిన కాల్పుల్లో అతడు గాయపడ్డాడు. కడప రిమ్స్‌లో చికిత్స అనంతరం డిశ్చార్జ్ కావడంతో, పీటీ వారంట్‌పై కోర్టులో ప్రవేశపెట్టినట్లు డీఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు.