AP: దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి రెండ్రోజుల ఏసీబీ కస్టడీ ముగిసింది. విచారణ అనంతరం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఏసీబీ న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు శాంతికి జ్యుడీషియల్ రిమాండ్ కొనసాగించడంతో అధికారులు ఆమెను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. కాగా, ఆమె తరపు న్యాయవాదులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై తీర్పును కోర్టు సోమవారానికి వాయిదా వేసింది.