KMM: ఎర్రుపాలెంలోని బనిగండ్లపాడు పీహెచ్సీలో శనివారం వైద్యాధికారి డాక్టర్ ప్రశాంత్ ఆధ్వర్యంలో మలేరియా నివారణ అవగాహన ర్యాలీ నిర్వహించారు. పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త వహించాలని, సత్వర చికిత్సతో మలేరియాను నియంత్రించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు మనం చేయగలం అనే నినాదంతో దోమల ద్వారా వ్యాపించే వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించారు.