గద్వాల జిల్లా కేంద్రంలోని చింతలపేట ఎస్సీ బాలుర వసతి గృహంలో వేసవి శిక్షణ శిబిరాన్ని అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు ప్రారంభించారు. విద్యార్థులు సెలవుల్లో కంప్యూటర్, యోగా, మార్షల్ ఆర్ట్స్‌లో నైపుణ్యం సాధించాలని సూచించారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ఇటువంటి శిబిరాలు దోహదపడతాయని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, వార్డెన్లు పాల్గొన్నారు.