JGL: అంతర్జాతీయ మానవ హక్కుల పరిరక్షణ మండలి జిల్లా అధ్యక్షునిగా రాయికల్ పట్టణానికి చెందిన ఆడెపు రాజమౌళి నియామకమయ్యారు. మానవ హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం, ప్రజా సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆయనకు ఉన్న అంకితభావం, నిజాయితీ, నిబద్ధతకు గుర్తింపుగా ఈ నియామకం జరిగినట్లు పేర్కొన్నారు. తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.