SRD: మండల కేంద్రమైన సిర్గాపూర్ లో సగర(ఉప్పర) సంఘం ఆధ్వర్యంలో భగీరథ మహర్షి జయంతి వేడుకలు నేడు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు భగీరథుని చిత్రానికి పూజలు చేశారు సగర సంఘం జిల్లా ప్రచార కార్యదర్శి శ్రీనివాస్ సాగర్ మాట్లాడుతూ.. భగీరథ మహర్షి ఒంటి కాలి పై కఠోర తపస్సును చేసి గంగను దివి నుండిభువి కి తీసుకొచ్చి జీవకోటికి గంగను అందించిన మహనీయుడని కొనియాడారు.