E G: అంగన్వాడీ వర్కర్లకు కనీస వేతనం రూ.26,000గా పెంచాలని, మే నెల మొత్తం వేసవి సెలవులు ఇవ్వాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. అదనపు పనుల నుంచి మినహాయింపు, జీవో-5 సవరణ, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని డిమాండ్ చేశారు.