VKB: పరిసరాల పరిశుభ్రత పాటించాలని వైద్యాధికారి కిరణ్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని కుల్కచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ.. మన ఇంటి పరిసరాలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు.