KMM: ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకేంద్రాలలో కనీస మౌలికవసతులు కల్పించకుండా తూతూ మంత్రంగా ఏర్పాటు చేసిందని సీపీఎం జిల్లా కమిటీసభ్యుడు శ్రీనివాస్ విమర్శించారు. శనివారం ఆయన సీపీఎం నాయకులతో కలిసి సత్తుపల్లి, కాకర్లపల్లి మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి మాట్లాడారు. కొనుగోలు కేంద్రాలలో గన్నీసంచులు, తూకం యంత్రాలు, తేమను కొలిచేపరికరాలులేవని మండిపడ్డారు.