WGL: మంటలు అంటుకుని ఎనిమిది ఎకరాల గడ్డివాము పూర్తిగా దగ్ధమైన ఘటన పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. ఉద్దేశపూర్వకంగానే గుర్తు తెలియని వ్యక్తులు గడ్డివామును తగలబెట్టారని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. భారీ నష్టం వాటిల్లిందని, వారికి న్యాయం చేయాలని స్థానికులు కోరారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.