SS: జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. రెవెన్యూ, పౌరసరఫరాల అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 8.24 లక్షల లీటర్ల పెట్రోల్, 7.74 లక్షల లీటర్ల డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. బంకుల్లో క్యాన్లు, డ్రమ్ములకు ఇంధనం పోయరాదని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.