WGL: నెక్కొండ మండలం తోపనపల్లి గ్రామానికి చెందిన గడ్డల రాజు అరుదైన ఘనత సాధించారు. HYDలోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఓ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘లార్జెస్ట్ కరాటే డిస్ప్లే’ విభాగంలో ఆయన గిన్నిస్ వరల్డ్ రికార్డును నెలకొల్పారు. ఈ మేరకు గ్రాండ్ మాస్టర్ జయంత్ రెడ్డి చేతుల మీదుగా ఆయన ప్రపంచ రికార్డు ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు.