NTR: జిల్లాలో నీటి భద్రత సాధనకు జలధార-జలహారతి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ఈ మేరకు కలెక్టరేట్లో శనివారం ఆయన మాట్లాడారు. నీటి వనరుల సంరక్షణ, భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా గౌరవ సీఎం దార్శనికతకు అనుగుణంగా ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని 100 రోజుల ప్రత్యేక కార్యాచరణగా చేపడుతున్నట్లు వివరించారు.