ATP: జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో సభ్యులు లేవనెత్తిన ప్రజా సమస్యలను అధికారులు సత్వరమే పరిష్కరించాలని చైర్పర్సన్ బోయ గిరిజమ్మ ఆదేశించారు. వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలని, ఉరవకొండ, శింగనమల వంటి మండలాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు సూచించారు. 108 అంబులెన్స్ సేవల్లో నిర్లక్ష్యం వహించరాదని స్పష్టం చేశారు.