NRML: తానూర్‌లో పిచ్చికుక్కల దాడిలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వేర్వేరు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి, శనివారం ఉదయం ఒంటరిగా వెళ్తున్న వ్యక్తులపై, చిన్నారులపై పిచ్చికుక్కలు దాడి చేసి తీవ్రంగా కరిచాయి. వెంటనే స్థానికులు, కుటుంబీకులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తానూర్, భైంసా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.