KMM: రాజకీయ పరిస్థితులను ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ పార్టీ శ్రేణులు ప్రజల్లో ఉండాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భాగం హేమంత్ సూచించారు. పేదల పక్షాన పోరాడేందుకు నిరంతరం జ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. శనివారం ఖమ్మం జిల్లా కార్యాలయంలో జరిగిన శిక్షణ తరగతుల్లో ‘పార్టీ నిర్మాణం-ప్రజా సంఘాలు’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు.