GDWL: అమరవాయి గ్రామంలోని పలు ప్రాంతాల్లో నెలకొన్న మిషన్ భగీరథ నీటి సమస్యపై అధికారులు సానుకూలంగా స్పందించారు. పాపమ్మ గుడి వద్ద గల ట్యాంక్ నుంచి కొత్త పైపులైన్ కనెక్షన్ ఇచ్చేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే పైపులను తెప్పించామని, త్వరలోనే పనులు పూర్తి చేస్తామని సర్పంచ్ పి. హుస్సేన్ తెలిపారు. దీంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.