TG: ఆర్టీసీ సమ్మెపై కేబినెట్లో చర్చించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ‘కార్మికులతో ఐదుగురు మంత్రులు చర్చిస్తారు. రెవెన్యూ రిసోర్సెర్ కమిటీ ఏర్పాటు చేశాం. కార్మికులు క్షణికావేశానికి లోనుకావొద్దు. కార్మికుల సమస్యల పట్ల సానుకూలంగా ఉన్నాం. బెనిఫిట్స్ కోసం రిటైర్డ్ ఉద్యోగులు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం’ అని తెలిపారు.