MNCL: చెన్నూర్ మండలం నర్సక్కపేట గ్రామంలోని ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా సౌకర్యాలను పరిశీలించి, పాఠశాల సరిహద్దు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఎరువుల దుకాణం తనిఖీ చేసి ట్రేడ్ లైసెన్స్ పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని యజమానికి సూచించారు.