SDPT: జగదేవపూర్ మండల పరిధిలోని తిమ్మాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ సుమన్ గౌడ్(45) గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించారు. ఈ విషయం తెలిసిన వెంటనే గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, ఉపేందర్ రెడ్డి తదితరులు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సుమన్ గౌడ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.