BDK: న్యాయమైన తమ డిమాండ్లు పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె శుక్రవారం నాటికి 3వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వం నుంచి సరైన స్పందన లభించకపోవడంతో ఆర్టీసీ ఉద్యోగ, కార్మిక సంఘాలు, విపక్షాల ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు హాజరై మాట్లాడారు.