TG: బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి బీజేపీ కార్యాలయానికి వెళ్లారు. పార్టీ సంస్థాగత కార్యదర్శి చంద్రశేఖర్ తివారీని ఆమె కలిశారు. గత కొంతకాలంగా మల్లారెడ్డి BJPలో చేరుతారంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల కుటుంబ సభ్యులతో సహా ప్రధాని మోదీని మల్లారెడ్డి కలిశారు. ఈ నేపథ్యంలో BJP కార్యాలయనికి ప్రీతి రెడ్డి రావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.