BPT: వేసవి దృష్ట్యా బాపట్ల మున్సిపాలిటీ కీలక నిర్ణయం తీసుకుంది. పైప్‌లైన్ సౌకర్యం లేని ప్రాంతాలకు ఆరు ట్యాంకర్ల ద్వారా తాగునీరు అందిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. నీటి ఎద్దడితో ఇబ్బంది పడేవారు వెంటనే అధికారులను ఆశ్రయించాలని సూచించారు. ట్యాంకర్ల ద్వారా నీరు కావాల్సిన వారు హెల్ప్‌లైన్ నంబర్ 08643-224027, ఏఈ శ్రీనివాస్ 9849907286ను సంప్రదించాలని కోరారు.