రోజంతా బూట్లు ధరించడం వల్ల పాదాలకు గాలి ఆడక చెమట పట్టి, బ్యాక్టీరియా చేరి ఇన్ఫెక్షన్లు, బొబ్బలు వచ్చే ప్రమాదం ఉంది. మడమ నొప్పీ వేధిస్తుంది. కాబట్టి మధ్యమధ్యలో బూట్లు తీసి పాదాలకు గాలి తగిలేలా చూడాలి. కాళ్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కోవడం ద్వారా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా పాదాల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.