PDPL: మంథని మండలంలో 35 గ్రామ పంచాయతీల్లోనే అతిపెద్ద మేజర్ గ్రామ పంచాయతీ అయిన గుంజపడుగుకి సొంత భవనం లేకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దశాబ్ద కాలంగా ఈ పంచాయతీ కార్యాలయం సరైన వసతులు లేక తాత్కాలిక భవనాల్లో కాలం వెళ్లదీస్తోంది. ఇప్పటికైనా పాలకవర్గం దృష్టి సారించి పాలకులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లి అతిపెద్ద గ్రామ పంచాయతీ సొంత భవనం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.