ATP: ఆస్తి పన్ను వసూళ్లలో తాడిపత్రి మున్సిపాలిటీ రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఏడాది పన్ను వసూళ్ల లక్ష్యం రూ.12 కోట్లు కాగా, అధికారులు రూ.10.20 కోట్లు రాబట్టారు. 86 శాతం వసూళ్లతో మున్సిపాలిటీ మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. పౌరుల సహకారం, అధికారుల కృషితోనే ఈ ఘనత సాధ్యమైందని ఉన్నతాధికారులు తెలిపింది.