CTR: చిత్తూరులో మాజీ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మన్ డీకే ఆదికేశవులు నాయుడు వర్ధంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మురకంబట్టు లో ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద, స్థానిక నాయకులతో కలిసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో చుడా చైర్పర్సన్ కాతర హేమలత, తదితరులు పాల్గొని ఆయన సేవా కార్యక్రమాలను కొనియాడారు.