ATP: గుంతకల్లు రైల్వే డివిజన్లో కొత్త లైన్ల ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. గతంలో నిర్వహించిన సర్వేలను పునఃపరిశీలించి తుది నిర్ణయం తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. తాడిపత్రి నుంచి అనంతపురానికి నేరుగా లైన్ నిర్మిస్తే ప్రయాణ సమయం తగ్గుతుందని భావిస్తున్నారు. ముద్దనూరు-ముదిగుబ్బ, మంత్రాలయం-కర్నూలు మార్గాల ఏర్పాటుపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.