మోహన్ లాల్, దర్శకుడు జీతూ జోసెఫ్ కాంబోలో వస్తున్న ‘దృశ్యం 3’ విడుదలకు ముందే చిక్కుల్లో పడింది. అమెజాన్ ప్రైమ్‌తో కుదుర్చుకున్న పాత ఒప్పందాన్ని నిర్మాత రద్దు చేసుకోవడంతో సదరు సంస్థ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై స్పందించిన కోర్టు మే 15 వరకు మూవీ డిజిటల్ హక్కులపై స్టే ఇచ్చింది. ఫలితంగా మే 21న విడుదల కావాల్సిన ఈ మూవీ వాయిదా పడే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల టాక్.