RR: హయత్ నగర్ పరిధి అనుమగల్లో జరుగుతున్న అభ్యుదయ యువజన సంఘం భవన నిర్మాణ పనులను మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి పరిశీలించారు. వారు మాట్లాడుతూ.. యువజన సంఘం భవన నిర్మాణం పూర్తయిన తర్వాత స్థానిక యువతకు వివిధ సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకు వేదికగా ఉపయోగపడుతుందన్నారు. నిర్దేశిత కాలంలోనే పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.