NDL: దివంగత MLA భూమా శోభా నాగిరెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి భూమా ఘాట్ వద్ద ఇవాళ MLA అఖిలప్రియ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. శోభా నాగిరెడ్డి మరణించి 12 ఏళ్లు పూర్తయ్యాయంటే నమ్మలేకపోతున్నామని అన్నారు. తల్లిదండ్రులు, కార్యకర్తలకు ఇచ్చిన భరోసానే కొనసాగిస్తామని, భూమా కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు.