VZM: బొబ్బిలి CI నారాయణరావు శుక్రవారం సాయంత్రం స్దానిక కలువరాయి ప్రైవేటు అకాడమి కళాశాల వద్ద డ్రగ్స్ వలన కలిగే నష్టాలపై యువకులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని యువకులతో ప్రతిజ్ఞ చేయించారు. గంజాయి, మత్తు పదార్ధాలతో జీవితాలు నాశనం అవుతాయని, విద్యార్థి దశ నుంచి క్రమశిక్షణతో చదువుకుని బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు.