GDWL: ఏటీసీలో నిర్వహిస్తున్న నైపుణ్యాభివృద్ధి శిక్షణలను యువత సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ నర్సింగరావు సూచించారు. 172 సీట్ల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని, ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాలతో స్వయం ఉపాధి దిశగా ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు. చదువుతో పాటు నైపుణ్యాలు పెంపొందించుకోవడం ద్వారా ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు.