NLG: ప్రతినెల చివరి శనివారం వృద్ధులు, దివ్యాంగులకు నిర్వహించే ప్రత్యేక ప్రజావాణి వాయిదా వేసినట్లు, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణ వేణి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. వేసవికాలం తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున వాయిదా వేసినట్లు తెలిపారు. ప్రత్యేక ప్రజావాణి నిర్వహించే తేదీ ప్రకటించే వరకు వృద్ధులు, దివ్యాంగులు ప్రజావాణికి రావద్దని సూచించారు.