ట్రాఫిక్ నిబంధనలను పర్యవేక్షించాల్సిన AI కెమెరాలు సాంకేతిక లోపాలతో వాహనదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. హెల్మెట్, సీట్ బెల్ట్ ఉన్నా లేవని తప్పుడు చలాన్లు వేస్తున్నాయి. ఒకే తప్పుకు నిమిషాల వ్యవధిలో రెండు మూడు సార్లు జరిమానాలు విధిస్తుండటం గమనార్హం. పెండింగ్ చలాన్లలో దాదాపు 18 శాతం తప్పుడువేనని నివేదికలు చెబుతున్నాయి. దీనివల్ల సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.