KDP: బద్వేల్ బైపాస్ రోడ్ వద్ద బ్రిడ్జ్ సమీపంలో హైవేపై వెళ్తున్న లారీ అదుపుతప్పి కిందకు పడిపోయింది. అదృష్టవశాత్తూ పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో డ్రైవర్ సురక్షితంగా బయటపడగా, లారీకి మాత్రం నష్టం జరిగినట్లు సమాచారం. అధికారులు ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.