ఇంటా బయటా పనులతో సతమతమయ్యే మహిళల కోసం నిపుణులు ‘క్వయిట్ అవర్’ను సూచిస్తున్నారు. రోజులో ఒక గంట పాటు ఫోన్లు, టీవీలకు దూరంగా ప్రశాంతంగా గడపడమే దీని ఉద్దేశం. ఇలా చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి, మెదడుకు విశ్రాంతి దొరుకుతుంది. ఫలితంగా నిద్రలేమి సమస్యలు దూరమై, ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.