కృష్ణా: గ్రామ పరిశుభ్రత కోసం శ్రమిస్తున్న ప్రతి ఒక్కరూ ఆదర్శనీయులు అని చల్లపల్లి ఎంఈవో పీ.వెంకటేశ్వరరావు అన్నారు. శనివారం చల్లపల్లి మండలం పాగోలు ప్రధాన రహదారిలో స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు రోడ్డు, మార్జిన్లు శుభ్రం చేశారు. చెత్త, పిచ్చి మొక్కలు తొలగించారు. ఎంఈవో వెంకటేశ్వరరావు కార్యకర్తలతో కలిసి శ్రమదానం చేశారు.