NZB: ఎడపల్లి మండలంలోని ఎడపల్లితో పాటు జానకంపేట గ్రామాలలోగల రైతు వేదికలలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతున్నట్లు మండల వ్యవసాయ శాఖ అధికారి సిద్ధిరామేశ్వర్ ఇవాళ తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. యూరియా బుకింగ్, PM కిసాన్, రైతుబంధు వంటి ప్రభుత్వ పథకాలకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఎంతగానో దోహదపడుతుందని పెర్కొన్నారు.