AP: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు కాకినాడ మొబైల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. దీనిపై అనంతబాబు స్పందిస్తూ.. తనను అన్యాయంగా ఇరికించారని, విచారణకు పూర్తిగా సహకరిస్తున్నట్లు చెప్పారు. అయినా సరే తనను వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. తాను ఎవరినీ ప్రలోభాలకు గురిచేయలేదని తెలిపారు.