TG: ఆర్టీసీ కార్మికుల సమ్మె ముగిసింది. ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో అర్థరాత్రి నుంచే కార్మికులు సమ్మె విరమించి విధుల్లో చేరారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన డిమాండ్‌పై స్పష్టత రావడంతో బస్సులు మళ్లీ రోడ్డెక్కాయి. రవాణా సౌకర్యాలు పునరుద్ధరణ కావడంతో సామాన్య ప్రయాణికులకు భారీ ఉపశమనం లభించింది.